![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "మిస్టర్ ప్రెగ్నెంట్" టీమ్ వచ్చింది. సయ్యద్ సోహైల్, రూప, అలీ రెజా, దీప్తి వచ్చారు. ఆగష్టు 5 న ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో చూస్తే ఎంతో ఫన్నీగా, కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ టీమ్ షోలో ఎంటర్టైన్ చేశారు. ఆగస్టు 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుమ అడ్డా షో ప్రోమో ఎండింగ్ లో సోహైల్ అందరితో కంటతడి పెట్టించాడు. తన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు. "లైఫ్ లో ముందుకు ఎలా వెళ్ళాలి యాక్సెప్ట్ చేస్తారా లేదా.. రియాలిటీ షో నుంచి, బుల్లితెర నుంచి వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది.
నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు గ్లిమ్ప్స్ రిలీజ్ చేసాకా చూసిన వాళ్లంతా ఏంట్రా ఈ తేడాగాడు అన్నట్టుగా చాలా మంది కామెంట్స్ చేశారు" అని చెప్తూ ఏడ్చేశాడు సోహైల్ . మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల ఈ చిత్రాన్ని నిర్మించగా... కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. "9 నెలల కష్టాన్ని తల్లి నవ్వుతూ భరించి, ప్రాణాలకు తెగించి ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్" అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీలో హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గా కనిపించనున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఈమధ్య ప్రయోగాత్మక చిత్రాలు బాగానే క్లిక్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా కొత్తదనాన్ని కోరుకుంటుండడంతో డైరెక్టర్స్ కూడా ప్రయోగాలు చేయడానికి వెనకాడడం లేదు. ఈ మూవీలో సీనియర్ నటి సుహాసిని, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర వంటి వాళ్ళు నటించారు. ఇక ఈ మూవీలో " హే చెలి" అనే రొమాంటిక్ సాంగ్ కి సోహైల్ శ్రీ సత్యతో కలిసి అద్భుతమైన రీల్ చేసాడు. ఆ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![]() |
![]() |